తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తి అంచనాలపై పరిశోధనకు రాజేశ్వర్ కు డాక్టరేట్
డిచ్ పల్లి, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థి పాలెపు రాజేశ్వర్ "తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వ్యవసాయ ఉత్పత్తి అంచనాలలో డేటా సైన్స్ అనువర్తనాలు" అనే అంశంపై అప్లైడ్ స్టాటిక్టిక్స్ విభాగ అధిపతి ప్రొఫెసర్ కె.సంపత్ కుమార్ పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేశారు. ప్రొఫెసర్ వి.వి.హరగోపాల్, ఉస్మానియా యూనివర్సిటీ (రిటైర్డ్) బాహ్య పరిశీలకుడిగా వ్యవహరించారు. ఈ పరిశోధన ద్వారా వ్యవసాయ రంగంలో పేరుకుపోయిన భారీ చారిత్రక పంట డేటా, వాతావరణ సమాచారం, నేల లక్షణాలు, ఇతర వ్యవసాయ అంశాలను డేటా...