డిచ్ పల్లి, బతుకమ్మ :
తెలంగాణ విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థి పాలెపు రాజేశ్వర్ “తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వ్యవసాయ ఉత్పత్తి అంచనాలలో డేటా సైన్స్ అనువర్తనాలు” అనే అంశంపై అప్లైడ్ స్టాటిక్టిక్స్ విభాగ అధిపతి ప్రొఫెసర్ కె.సంపత్ కుమార్ పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేశారు. ప్రొఫెసర్ వి.వి.హరగోపాల్, ఉస్మానియా యూనివర్సిటీ (రిటైర్డ్) బాహ్య పరిశీలకుడిగా వ్యవహరించారు. ఈ పరిశోధన ద్వారా వ్యవసాయ రంగంలో పేరుకుపోయిన భారీ చారిత్రక పంట డేటా, వాతావరణ సమాచారం, నేల లక్షణాలు, ఇతర వ్యవసాయ అంశాలను డేటా సైన్స్ పద్ధతులతో విశ్లేషించి భవిష్యత్ పంట ఉత్పత్తిని ఖచ్చితంగా అంచనా వేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో వర్షపాతం, పంట రకం, ప్రాంతం వంటి కీలక అంశాల ఆధారంగా మెషిన్ లెర్నింగ్ నమూనాలను ఉపయోగించి పంట దిగుబడి అంచనాలను రూపొందించడం జరుగుతుంది. ఈ పరిశోధన ఫలితాలు రైతులకు పంట ప్రణాళికలో, ప్రభుత్వానికి వ్యవసాయ విధానాల రూపకల్పనలో, ఆహార భద్రతా నిర్ణయాల్లో ఎంతో ఉపయోగపడతాయని పాలెపు రాజేశ్వర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ లు విద్యార్థిని అభిందించారు.