Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 March 2025, 11:36 am Posted by : ramakrishna

కామారెడ్డి జిల్లా ఎస్పీగా రాజేష్ చంద్ర బాధ్యతల స్వీకరణ

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా ఎస్పీగా రాజేష్ చంద్ర సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా జిల్లా పోలీస్ అధికారులు ఎస్పీని   కలిసి అభినందనలు తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సింధు శర్మ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఉన్న ఎస్పీ సింధు శర్మ ఇంటెలిజెన్స్ విభాగానికి బదిలీయిన విషయం తెలిసిందే. ఈసందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ.. జిల్లా పరిధిలోని ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటూ చట్ట పరిధిలో ప్రజల సమస్యలను పరిష్కారించాలని సూచించారు. ప్రజల భద్రత, రక్షణే ప్రధాన లక్ష్యమని తెలియజేశారు.