Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 January 2026, 4:20 pm Posted by : ramakrishna

35వ జాతీయస్థాయి సబ్ జూనియర్ పోటీలకు ఎంపికైన రాజారపు స్పందన…

నందిపేట్, బతుకమ్మ :

 

జనవరి 21 నుండి ఫిబ్రవరి 4వ తేదీ వరకు హర్యానా రాష్ట్రం” కురుక్షేత్ర ” లో జరగనున్న 35వ జాతీయస్థాయి సబ్ జూనియర్ ఖో ఖో పోటీలకు నందిపేట్ మండల కేంద్రంలోని గీతా కాన్వెంట్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్న వన్నెల్-కె గ్రామానికి చెందిన రాజారపు స్పందన తెలంగాణ జట్టుకు ఎంపిక అయినది. జనవరి 18, 19, 20వ తేదీలలో మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట లో జరిగిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ ఖో ఖో పోటీలలో అత్యంత ప్రతిభ కనబరిచినందున ఎంపిక కావడం జరిగింది. ఎంపికైన స్పందనను మండల విద్యాశాఖ అధికారి అవధూత గంగాధర్, పాఠశాల కరస్పాండెంట్ కానూరి గంగాసాగర్, పాఠశాల డైరెక్టర్ కానూరి శోభ, ప్రధానోపాధ్యాయులు చెలిమెల గంగా భూషణ్, వ్యాయామ ఉపాధ్యాయులు గాండ్ల ముత్యం, మర్రిపల్లి సుమలత, అధ్యాపక బృందం అభినందించారు.