Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 July 2026, 5:12 pm Posted by : ramakrishna

రాజంపేట ఎ ఈ ఓ మౌనిక సస్పెన్షన్

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం వ్యవసాయ విస్తరణ అధికారి మౌనిక ను జిల్లా అధికారులు సస్పెండ్ చేసారు. వారు తెలిపిన వివరాల ప్రకారం రాజంపేట మండలం షేర్ శంకర్ తండాకు చెందిన కాట్రోత్ కిషన్ అనే గిరిజన రైతుకు చెందిన ఎకరం రెండు గుంటల భూమి ఉంది.. ఈ భూమికి సంబంధించిన రైతు భరోసా నిధులు గత కొన్ని సంవత్సరాలుగా అకౌంట్లో జమ కావడం లేదు. దీంతో జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. కిషన్ ఫిర్యాదుతో అధికారులు విచారణ చేపట్టారు. విచారణ అనంతరం ఏఈవో మౌనిక బ్యాంకు అకౌంట్ లో… రైతు కిషన్ కు సంబందించిన రైతు భరోసా నిధులు రూ.90 వేలు జమైనట్లుగా గుర్తించిన అధికారులు ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. గత నెలలో జుక్కల్ నియోజకవర్గం లో ఒక మండల వ్యవసాయ అధికారిణి పై అధికారులు వేటు వేసిన విషయం తెలిసిందే…