వెబ్ న్యూస్, బతుకమ్మ: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ’ఎక్స్‘ వేదికగా స్పందించారు. ’ రాబోయే పదేళ్లు నేనే సీఎం అని.. రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడం కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్టానం ఆదేశాల మేరకే సీఎం ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను, నిఖార్సయిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరు’ అని రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు.
