Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 August 2025, 12:40 pm Posted by : ramakrishna

మంత్రి పదవిపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

అన్నదమ్ములం ఉన్నామని.. నన్ను పార్టీలోకి తీసుకున్నప్పుడు తెలియదా.. ?

వెబ్ న్యూస్, బతుకమ్మ :  మంత్రి పదవిపై మునుగోడు ఎమ్మెల్యే  కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడానికి కారణం సమీకరణలు కుదరకపోవడమే అని అంటున్నారన్నారు. తనను పార్టీలోకి తీసుకున్నప్పుడు తెలియదా ఇద్దరం అన్నదమ్ములం ఉన్నామని ప్రశ్నించారు.  ఒడ్డు దాటే వరకు ఓడ మల్లన్న ఒడ్డు దాటాక బోడి మల్లన్న అన్న చందంగా ఉందని విమర్శించారు.  9 మంది ఎమ్మెల్యే ఉన్న ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నారన్నారు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండకు ముగ్గురు మంత్రులు ఉండటం తప్పా? అని ప్రశ్నించారు. మా అన్నదమ్ములం సమర్థులమే, గట్టి వాళ్లమే అని చెప్పారు. మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే రాజ్ గోపాల్ రెడ్డికి అన్యాయం జరిగినట్లే అని పేర్కొన్నారు.  నాకు అన్యాయం జరిగినా పర్లేదు కానీ.. మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దని గత ప్రభుత్వానికి చెప్పినా ఇప్పుడు కూడా చెబుతున్నా అని స్పష్టం చేశారు.