ప్రకటన విడుదల చేసిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్
వెబ్ న్యూస్, బతుకమ్మ : బీజేపీ కేంద్ర నాయకత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా ను ఆమోదిస్తూ. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిర్ణయం తీసుకున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ శుక్రవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ నాయకుడు రామచందర్రావు ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. రాష్ట్ర అధ్యక్ష పదవికి తాను నామినేషన్ వేయడానికి వెళ్తే అడ్డుకున్నారని రాజాసింగ్ ఆరోపించారు. ఈ క్రమంలో తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి కాకుండా నాశనం చేసే వారికి పదవులు కట్టబెడుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన జూన్ 30న కిషన్ రెడ్డికి తన రాజీనామా సమర్పించారు. తాజాగా జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆయన రాజీనామాకు ఆమోదం తెలిపారు.