Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 July 2025, 7:47 pm Posted by : ramakrishna

రాజారెడ్డి సేవలు చిరస్మరణీయం

  • మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

 

ఆర్మూర్, బతుకమ్మ : ప్రజా సేవ తలంపు ఉన్నవారికి చాలా మార్గాల్లో సేవను అందించవచ్చునని నిరూపించిన ప్రజా సేవకుడు, సంఘ సంస్కర్త  స్వర్గీయ పైపుల రాజారెడ్డి సేవలు చిరస్మరనీయమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ రెడ్డి సంఘంలో ఏర్పాటు చేసిన  స్వర్గీయ పైపుల రాజారెడ్డి విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వృత్తి రీత్యా తన పనులను తాను నిర్వహిస్తున్న ఏదో రకంగా ప్రజా సేవ చేయాలనే తపన పడవాడిని ఆయన కొనియాడారు. ఆయన లాలన వృద్ధాశ్రమం వ్యవస్థాపకులని,ఆర్మూర్ రెడ్డి సంఘం వ్యవస్థాపక అద్ధ్యక్షులని అన్నారు.సంఘ సంస్కర్త గడ్డం పైపుల రాజారెడ్డి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనడనం తనకు చాలా ఆనందన్నిచ్చిందన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన రెడ్డి బంధువులు ,ఆత్మీయులు తదితరులు పాల్గొన్నారు.

Raja Reddy's services are memorable