Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 November 2024, 8:28 pm Posted by : ramakrishna

రాజా బహుదూర్ వెంకట్రాంరెడ్డి నేటితరం విద్యార్థులకు ఆదర్శం

  • ఒక లక్ష్యం నిర్దేశించుకొని విద్యార్థులు చదువుల్లో ముందుకెళ్లాలి
  • ఆర్ బి వి ఆర్ ఆర్ సొసైటీకి అండగా ఉంటాం
  • రోడ్లు భవనాలు, సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నిజామాబాద్ సిటీ బతకమ్మ :స్వర్గీయ రాజా బహుదూర్ వెంకట్రామిరెడ్డి నేటితరం విద్యార్థులకు ఆదర్శప్రాయుడని, అప్పట్లోనే విద్య కేవలం పురుషులకే మహిళలు కూడా చదువుల్లో రాణించాలని ఉద్దేశంతో ఆర్ బి బి ఆర్ ఆర్ సొసైటీని నెలకొల్పి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏడున్నర ఎకరాల స్థలంలో విద్యా సంస్థను నెలకొల్పడం అభినందనీయమని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ముబారక్ నగర్ లో గల ఆర్ బి వి ఆర్ ఆర్ హై స్కూల్ 42వ యాన్యువల్ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థి దశలనే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ముందుకు సాగితే జీవితంలోఉన్నత స్థానాన్ని చేరుకోచ్చని ఆయన అన్నారు.రెడ్డిల సంక్షేమం కోసం అప్పట్లోనే రాజా బహుదూర్ వెంకట్ రామ్ రెడ్డి పేద రెడ్డి కుటుంబాల కోసం ప్రత్యేకంగా వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేశారని ఆయన అన్నారు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లల పట్లఎల్లప్పుడూ గమనిస్తూనే ఉండాలనికేవలం ఉన్నతమైన పాఠశాలలో విద్యాభ్యాసం నేర్పుతున్నామనివారిని వదిలేసి ఇతర వ్యవహారాల్లో తిరగడం సరైన పద్ధతే కాదని, తాము నేర్చుకునే స్కూల్లో ఏ రకంగా విద్యను అభ్యసిస్తున్నారు అనుక్షణం గమనిస్తూ ఇంట్లో కూడా చదివేలా వారికి ప్రత్యేక సదుపాయాలను కల్పించాలన్నారు. అప్పుడే తమ పిల్లలు ప్రయోజకులుగా అవుతారన్నారు. ఇక ఆర్ బి బి ఆర్ ఆర్ సొసైటీకి ఎలాంటి సాయం కావాలన్నా ప్రభుత్వం అండగా ఉంటుందని ఎలాంటి అవసరం వచ్చిన తనదృష్టికి తీసుకురావచ్చని ఆయన అన్నారు.అలాగే ప్రభుత్వ తరపుననే కాకుండా ఆర్బివిఆర్ఆర్ సొసైటీఅభివృద్ధి కోసంపర్సనల్గా నా వంతు సహకారం కూడా ఎల్లప్పుడూ అందిస్తానన్నారు.

Raja Bahudur Venkatram Reddy is a role model for today's students

ఆర్ బి వి ఆర్ ఆర్ స్కూల్లో చదివే విద్యార్థులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రయోజకులుగామారారు.

రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి

గత కొన్ని నీళ్లుగా ఏళ్ల తరబడి ఆర్బివిఆర్ఆర్ సొసైటీ నిజామాబాద్ లో విద్యాసంస్థలు ఏర్పరిచి ఎంతోమంది విద్యార్థులను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ చదివిన విద్యార్థులు ప్రయోజకులుగా మారి తాము చదివిన పాఠశాల తో పాటు జిల్లాకు మంచి పేరు తీసుకు రావడం గర్వకారణమన్నారు. ఇందులో విద్య నేర్పే ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేక వహిస్తారని, చదువులో వెనుకబడిన వారిపట్ల ప్రత్యేక క్లాసులు ఏర్పాటు చేసి అంతేకాకుండా వారు ఏ రంగాల్లో నిష్ణాథితులుగా ప్రతిభావంతులుగా రాణిస్తారో అందులో చక్కని శిక్షణను అందించి రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థుల ప్రతిభనువెలికితీస్తుంటారని అన్నారు.అలాగే ఆర్.బి.ఆర్ సొసైటీకి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ చాటున విద్యార్థులకు బంగారు పథకాలతో మంత్రి,రూరల్ ఎమ్మెల్యే సత్కరించారు. అదేవిధంగా పాఠశాల 42వ వార్షికోత్సవ మహోత్సవం కి హాజరైన ముఖ్య అతిథులను ఆర్ బి బి ఆర్ ఆర్ సొసైటీ యాజమాన్యం సన్మానించారు.ఈ సందర్భంగా పాఠశాల వార్షికోత్సవ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అందరిని అలరించాయి. కార్యక్రమంలో ఆర్ బి బి ఆర్ ఆర్ సొసైటీ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి, సెక్రెటరీ గోవర్ధన్ రెడ్డి, స్కూల్ చైర్మన్ జగత్ రెడ్డి, హాస్టల్ చైర్మన్ అమర్జిత్ రెడ్డి, ఆలంబన చైర్మన్ రుక్మ రెడ్డి, ఉమెన్స్ వెల్ఫేర్ చైర్మన్ సువర్ణ రెడ్డి, ట్రెజరర్ సాయ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ సుజిత్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్ వీణరెడ్డి, ఏహెచ్ఎంశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Raja Bahudur Venkatram Reddy is a role model for today's students