Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 August 2024, 3:39 pm Posted by : ramakrishna

ఘనంగా రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి జయంతి వేడుకలు

బతుకమ్మ నిజామాబాద్ సిటీ :  రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి 155 వ జయంతి నగరంలో  గురువారం  ఘనంగా   నిర్వహించారు.     పట్టణంలోని స్థానిక మహనీయుల స్థూపాల వద్ద రాజా బహదూర్ వెంకట్ రామ్ రెడ్డి విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రముఖ వైద్యురాలు  కవితా రెడ్డి మాట్లాడుతూ మహిళలకు బడుగు బలహీన వర్గాల వారికి సమాజంలోని అందరికీ ఆదర్శంగా నిలిచే విధంగా రెడ్డి హాస్టల్ ను రెడ్డి కాలేజీలు స్థాపించడం జరిగిందన్నారు. దీనిలో మహిళలు చాలా చదువుకొని ఉన్నత పదవుల్లో స్థిరపడ్డారన్నారు.

Raja Bahadur Venkatarami Reddy's birth anniversary celebrationsనిజామాబాద్ నగర శివారులోని ముబారక్ నగర్లో గల ఆర్ బి వి ఆర్ ఆర్ పాఠశాలలు పాఠశాల వ్యవస్థాపకులు రాజా బహుదూర్ వెంకట రామ్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిజామాబాద్ ఏసిపి రాజా వెంకటరెడ్డి హాజరై ఆయన విగ్రహానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజా బహుదూర్ వెంకట్రామరెడ్డి రెడ్డిల సమాజం కోసం ఎంతగానో కృషి చేశారని అదేవిధంగా వర్గానికి చెందిన పిల్లల కోసం ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసి కృషి చేశారని అన్నారు. వారి ఆశయాలను ప్రతి ఒక్క విద్యార్థి నెరవేర్చాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఆర్ బి వి ఆర్ ఆర్ పాఠశాల చైర్మన్ జగత్ రెడ్డి, ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి, సెక్రెటరీ గోవర్ధన్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ సుజిత్ రెడ్డి, ఆలంబన వృద్ధాశ్రమ చైర్మన్ రుక్మారెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త విద్యావేత్త నరేందర్ రెడ్డి,  శంకర్ రెడ్డి, మాజీ మండలాధ్యక్షుడు భూమారెడ్డి, బార్ అసోసియేషన్ రాష్ట్ర సభ్యులు రాజేందర్ రెడ్డి, సీనియర్ అడ్వకేట్లు జీవి కృపాకర్ రెడ్డి,  నర్సింహారెడ్డి లు,   మధుసూదన్ రెడ్డి,  సాయి రెడ్డి, జి ప్రభాకర్ రెడ్డి, నరసింహారెడ్డి, మైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Raja Bahadur Venkatarami Reddy's birth anniversary celebrations