నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాదు పట్టణ మోటాడి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాజ బహుదూర్ వెంకటరామిరెడ్డి జయంతిని పురస్కరించుకొని వినాయక నగర్ లో గల రాజాబహద్దూర్ వెంకట్ రాంరెడ్డి విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ జిల్లా సిపి సాయి చైతన్య, ఎసిపి రాజా వెంకట్ రెడ్డి, రెడ్డి సంఘ సభ్యులు హాజరై నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ వెంకట్ రాంరెడ్డి జీవితం అందరికి ఆదర్శం అని, ఆయనా పోలీస్ అధికారి గా కూడా పనిచేసాడని కొనియాడారు. పట్టణ మోటాడి రెడ్డి సంక్షేమ సంఘ అధ్యక్షులు గాధరి సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ రాజా బహుద్దూర్ వెంకట రామ్ రెడ్డి సేవలు అమోఘమని అయన ముఖ్యం గా విద్య పై శ్రద్ద వహించి పేద విద్యార్థులకు హాస్టల్ వసతులు చదువుకోవడానికి పాఠశాల లా పై ద్రుష్టి వహించి ఆర్బీవీఆర్ఆర్ సంస్థలను నిర్మించి రెడ్డి సోదరులకు ఉపయోగ పడే విధముగా సంస్థలు నిర్మించారని తెలిపారు. ఆయన సేవలను స్మరించుకొంటూ మనం కూడా పదిమందికి ఉపయోగేపడే విధముగా సేవ కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ మోటాడి రెడ్డి సంఘం ప్రధాన కార్యదర్శి మోతే నవీన్ రెడ్డి, కోశాధికారి శ్రీకాంత్ రెడ్డి, రెడ్డి ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు అంతి రెడ్డి విజయపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులు దామోదర్ రెడ్డి, మురళి రెడ్డి, కార్యవర్గ సభ్యులు సాయరెడ్డి,వినోద్ రెడ్డి, మూల జనార్దన్ రెడ్డి,బేతి రవీందర్ రెడ్డి, గంగారెడ్డి, గుడిపల్లి నాగిరెడ్డి నల్లా సుభాష్ రెడ్డి, ల్యాబ్ గంగారెడ్డి, సతీష్ రెడ్డి,రాజరెడ్డి, శ్రీధర్ రెడ్డి, విజయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
