Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 January 2026, 7:11 pm Posted by : ramakrishna

ఉత్తమ ఎంపీడీవోగా రాజ్ కిరణ్ రెడ్డి

భిక్కనూరు, బతుకమ్మ :

 

ఉత్తమ అధికారిగా భిక్కనూరుకు చెందిన ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి ఎంపికయ్యారు. కామారెడ్డి జిల్లా లోని ఇందిరాగాంధీ స్టేడియంలో సోమవారం జరిగిన 77వ గణతంత్ర దినోత్సవం వేడుకల్లో ఆయనకు అడిషనల్ కలెక్టర్ విక్టర్ ఎస్పీ రాజేష్ చంద్ర చేతులమీదుగా అవార్డుతో పాటు ప్రశంస పత్రాన్ని అందజేశారు. మండల ప్రజలకు ఆయన అందిస్తున్న సేవలను జిల్లా స్థాయి అధికారుల తమ సేవలను గుర్తించినందుకు జిల్లా కలెక్టర్ కి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో ఇంకా నిబద్దతతో పనిచేస్తామని ప్రజలకు అత్యుత్తమ సేవలు అందిస్తానని తెలిపారు.