మత్స్యకార్మికులకు మెరుగైన ఉపాధి కోసం నాణ్యమైన చేప పిల్లల పెంపకం

కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి   నిజామాబాద్, బతుకమ్మ : మత్స్య కార్మిక కుటుంబాల ఉపాధిని మెరుగుపర్చి, వారిని ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు గాను నాణ్యమైన చేప పిల్లల పెంపకంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం సాయంత్రం మత్స్య శాఖ  పనితీరుపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. మత్స్య అభివృద్ధి పథకం కింద 2024 - 2025 సంవత్సరానికి గాను వంద శాతం సబ్సిడీపై 799 చెరువులు, రిజర్వాయర్లలో కోటీ 92 లక్షల...