తెలంగాణలో రెండురోజులపాటు వర్షాలు

. 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ హైదరాబాద్, బతుకమ్మ: తెలంగాణలో రెండు రోజులపాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిది. రానున్న రెండు మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని పేర్కొన్న వాతావరణశాఖ, 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వాతావరణశాఖ ప్రకటన నేపథ్యంలో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. చాలా చోట్ల ధాన్యం కుప్పలు అలాగే ఉన్నాయని, వర్షం కురిస్తే తమ పరిస్థితి ఏమిటని భయపడుతున్నారు.