Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 October 2025, 5:06 pm Posted by : ramakrishna

వర్షానికి తడిసిన వరి ధాన్యం

రుద్రూర్, బతుకమ్మ: ఆరుగాలం శ్రమించి పండించిన వరి పంట అమ్ముకునేందుకు రైతులకు తిప్పలు తప్పడం లేదు. రుద్రూర్ గ్రామంలో సోమవారం రాత్రి కురిసిన వర్షానికి రైతులు ఆరబోసిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. అప్పటివరకు ఎండిపోయిన దాన్యం ఒక్కసారిగా వర్షం కురవడంతో ధాన్యం తడిసిపోయిందని రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వడ్లు తడవకుండా కాపాడుకునేందుకు రైతులు అనేక పాట్లు పడుతున్నారు.