కాసేపట్లో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్ష సూచన
హైదరాబాద్, బతుకమ్మ : రాబోయే రెండు గంటల్లో పలు జిల్లాలో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, మెదక్ ఆసిఫాబాద్ జిల్లాలో పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది.