నిజామాబాద్. బతుకమ్మ : సాఫ్ట్ బాల్ లో రాణించిన క్రీడాకారులను గురువారం రైల్వే ఎస్సై సాయిరెడ్డి అభినందించారు. కీర్తన ఓడ్యాట్ పల్లి, సౌజన్య ఆర్మూర్, వర్షిణీ జక్రాన్ పల్లి, నిషింతా వెస్లీనగర్ తండా, సాయి శ్రీ మెదక్ క్రీడాకారులను, సాఫ్ట్ బాల్ సెక్రెటరీ గంగామోహన్, నవీన్ లను ఎస్సై అభినందించారు. జాతీయ స్థాయిలో రాణించి తైవాన్ దేశంలో జరిగే అంతర్జాతీయ స్థాయి పోటీలకు వీరు ఎంపికయ్యారు. క్రీడాకారులు నిజామాబాద్ రైల్వే స్టేషన్ కు వచ్చిన సందర్భంగా వారిని ఎస్సై అభినందనలు తెలిపారు.