యువతిని కాపాడిన రైల్వే పోలీసులు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకున్న యువతిని రైల్వే పోలీసులు మంగళవారం కాపాడినట్లు రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి తెలిపారు. వీరన్న గుట్ట గ్రామానికి చెందిన మౌనిక అనే అమ్మాయి ఇంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పేసి తనకు పెళ్లి చేయట్లేదు అనే ఉద్దేశంతో చనిపోవాలని నిర్ణయించుకుందని తెలిపారు. దీంతో నిజాంబాద్ రైల్వే స్టేషన్ కు వచ్చి సూసైడ్ చేసుకోవాలని అనుకుందన్నారు.  డ్యూటీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ హనుమన్లు, కానిస్టేబుల్ పండరి, షి టీమ్ ఇంచార్జి వర లక్ష్మి తనను గమనించి కాపాడారు....