రైల్వే బైపాస్ సర్వే అడ్డగింత
నిజామాబాద్, బతుకమ్మ: రైల్వే బైపాస్ పనుల సర్వే నిమిత్తం వచ్చిన అధికారులను సోమవారం నగరంలోని బైపాస్ రోడ్డులో ఉన్న అశోక ఎన్ క్లేవ్ వెంచర్ లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు అడ్డుకున్నారు. తాము రూపాయిరూపాయి కూడబెట్టి కొనుగోలు చేసిన ప్లాట్లు ఎలా ఇస్తామని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం 72 ప్లాట్లు కోల్పోవాల్సి వస్తోందని, రైల్వే శాఖ ఇస్తామంటున్న పరిహారం తమకు సరిపోదని పేర్కొన్నారు. అధికారులు సర్వే నిర్వహించకుండా లారీని అడ్డుగా పెట్టారు. దీంతో రైల్వే బైపాస్ పనులకు ఆదిలోనే ఆటంకాలు ప్రారంభమయ్యాయి....