రైలు ఢీకొని 90 గొర్రెలు మృతి

. . . వాగులో పడి గొర్రెల కాపరి గల్లంతు   కామారెడ్డి, బతుకమ్మ :   కామారెడ్డి పట్టణ శివారులో రైలు ఢీకొని 90 గొర్రెలు మృతి  చెందాయి. ఆదివారం కామారెడ్డి శివారులో ఓ వాగు పై నుంచి గొర్రెలు వెళ్తుండగా అదే సమయంలో రైలు రావడంతో రైలు ఢీకొని 90 గొర్రెలు మృతి చెందాయి. ఈ ఘటనలో గొర్రెల కాపరి సురేష్ వాగులో పడి గల్లంతయ్యారు. సంఘటన స్థలానికి కామారెడ్డి పోలీసులు చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.