Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 July 2025, 2:39 pm Posted by : ramakrishna

17న బీసీ బిల్లు సాధించేందుకు రైల్ రోకో

  • బీసీ బిల్లుపై బీజేపీ చొరవ తీసుకోవాలి
  • కులగణన వివరాలు బయట పెట్టాలి
  • తెలంగాణ జాగృతి  అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

 

హైదరాబాద్, బతుకమ్మ : బీసీ బిల్లును సాధించేందుకు ఈనెల 17న రైల్ రోకో కార్యక్రమం చేపడుతున్నట్లు తెలంగాణ జాగృతి  అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. హైదరాబాద్ లోని తన నివాసంలో గురువారం రైల్ రోకో పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు కోసం జూలై 17న జాగృతి ఆధ్వర్యంలో చేపట్టబోయే రైల్ రోకోను విజయవంతం చేయాలి. రైల్ రోకో కార్యక్రమానికి వివిధ పార్టీల మద్దతు కూడ గట్టాము. బీసీ బిల్లు పైన బిజెపి చొరవ తీసుకోవాలి. తెలంగాణ నూతన బిజెపి అధ్యక్షుడు రామచందర్ రావు కు లెటర్ రాశాం. ఆయన చొరవ తీసుకోనీ బిజెపి అధ్యక్ష హోదాలో తొలి విజయం నమోదు చేసుకోవాలి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లి ఖార్జున్ ఖర్గే  గురువారం హైదరాబాద్ వస్తున్నారు.

Rail Roko to achieve BC bill on 17th

స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ది పొందేందుకు మల్లి ఖార్జున్ ఖర్గే హైదరాబాద్ వస్తున్నారు. బిసిలకు ఇచ్చిన హామీలు అమలు చెయ్యకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలా వెళ్తారు. మల్లి ఖార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ బీసీల కోసం పార్లమెంట్ లో ఎన్నడూ మాట్లాడలేదు. మల్లి ఖార్జున్ ఖర్గే బిసిలకు 42 రిజర్వేషన్ అమలు అయ్యేలా బిజెపి పైన ఒత్తిడి తేవాలి. కులగణన వివరాలు బయట పెట్టాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పాత లెక్కలే చెప్తున్నారు. గ్రామ పంచాయతీల వారీగా కులగణన వివరాలు బయట పెట్టాలి. జూలై 17న రైల్ రోకో నిర్వహించి తెలంగాణ నుంచి ఢిల్లీ వెళ్ళే ప్రతి రైలును ఆపి నిరసన కార్యక్రమం విజయవంతం చేస్తాం. బీసీ రిజర్వేషన్ బిల్లు సాధించేందుకు బిజెపి పైన ఒత్తిడి తెస్తాం. బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ మెతక వైఖరి కనబరుస్తోంది. బనకచర్ల ప్రాజెక్ట్ పైన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరి కాంట్రాక్ట్ లు కోసమే బనకచర్ల ప్రాజెక్ట్ అంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారని కూడా అన్నారు. ఇకనైనా రేవంత్ రెడ్డి బనకచర్ల ను ఆపాలని గట్టిగా కొట్లాడాలి. రైల్ రోకో  కార్యక్రమానికి బిఆర్ఎస్ మద్దతు ఉంటుందా అని అడిగిన ప్రశ్నకు బీఆర్ఎస్ సపోర్ట్  ఉంటుంది’’ అని మాట్లాడారు.

Rail Roko to achieve BC bill on 17th