Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 October 2025, 6:50 pm Posted by : ramakrishna

పేకాట స్థావరాలపై దాడులు

  • 15 మంది  పేకాట రాయుళ్ల అరెస్ట్
  • 17 మంది పై కేసు నమోదు
  • 8 వాహనాలు, 15 సెల్ ఫోన్లు సీజ్

 

బతుకమ్మ, కోటగిరి : పోలీసుల మెరుపు దాడులతో భారీ సంఖ్యలో  పేకాటరాయుళ్లపై కేసులు నమోదు అయినట్టు స్థానిక ఎస్ఐ సునీల్ తెలిపారు. ఆయన తెలిపిన కథనం ప్రకారం కోటగిరి మండల కేంద్రంలోని రంజని క్లబ్ అలాగే  కొల్లూర్ రమేష్  అనే వ్యక్తి ఇంట్లో కొనసాగుతున్న పేకాట శిబిరాలపై స్థానిక పోలీసులు అదనపు బలగాలతో  సహకారంతో  విశ్వాసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించగా  పేకాట ఆడుతున్న 15 మందిని అదుపు లోకి తీసుకోగ ఒకరు పరారీ కాగా  సదరు ఇంటి యజమాని కొల్లూర్ రమేష్ తో కలిపి మొత్తం  17 మందిపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.. వారి వద్ద నుండి 15 మొబైల్స్,8 మోటార్ వెహికిల్ వాహనాలు అలాగే రూ.28800 నగదును సీజ్ చేశామని ఆయన అన్నారు.