బతుకమ్మ, మాచారెడ్డి: మండలం లోని ఎల్లంపేట గ్రామంలో రెండు బెల్ట్ షాపులపై పోలీసులు దాడులు చేసి అక్రమంగా అమ్మడానికి నిల్వ ఉంచిన తొమ్మిది వేల రూపాయల మద్యం స్వాధీనం చేసుకున్నారు. రెండు బెల్ట్ షాపులను సీజ్ చేసి అక్రమంగా మద్యం అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు మాచారెడ్డి ఎస్ఐ అనిల్ కుమార్ తెలిపారు.