. . . మండల బీజేపీ ప్రెసిడెంట్ బేల్దారి నవీన్
వేల్పూర్, బతుకమ్మ :
దేశద్రోహ పార్టీలు, రోయింగ్యాలతో కలిసి కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ దీక్ష పేరిట ఢిల్లీలో దొంగనాటకానికి తెర లేపారని మండల బీజేపీ ప్రెసిడెంట్ బేల్దరి నవీన్ ఆరోపించారు. ఈ మేరకు మండల బీజేపీ ఆధ్వర్యంలో గురువారం దేశద్రోహి రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నీట్ పేపర్ లీక్ పేరిట బీజేపీ పార్టీ పై, ప్రధాన మంత్రి మోదీ పై బురద జల్లే ప్రయత్నాన్ని చేశారన్నారు. ఈ తప్పుడు ప్రచారం చేసి భారత దేశ ఖ్యాతిని ప్రపంచంలో తగ్గించడానికి ప్రయత్నించారన్నారు. దేశద్రోహ పార్టీలైన తృణమల్ కాంగ్రెస్, ఆప్ పార్టీ, సీజెపీ పార్టీలతో పాటు రోహింగ్యాలతో కలిసి జంతర్ మంతర్ వద్ద చేసిన దీక్షను దొంగ దీక్షను కేంద్రం గుర్తించి దేశద్రోహులకు తగిన గుణపాఠం చెప్పడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి లాబిశెట్టి భానుచందర్, మండల ఉపాధ్యక్షులు జల్ల ప్రవీణ్, కొట్టాల శ్రీనివాస్, సీనియర్ నాయకులు బద్దం రాజారెడ్డి, మాజీ సర్పంచ్ తీగల మోహన్ రెడ్డి, బాస గంగాధర్, జాగిరపు కృష్ణారెడ్డి, పోరుమల్ రాజేందర్, పన్నాల, ఏలేటి రాజేందర్, అడ్వల శ్రీను, నీలేందర్, అంకం శ్రీధర్, జిల్లా జంగన్న, పెయింటర్ గంగాధర్, జ్ఞానేశ్వర్, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.