హైదరాబాద్, బతుకమ్మ : గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ. కోటి నజరానా ప్రకటించింది. పాతబస్తీ బోనాల సందర్భంగా ఈ పురస్కారం ప్రకటించంది. స్వయంకృషితో ఎదిగిన రాహుల్ సిప్లిగంజ్ యువతకు మార్గదర్శకుడని రేవంత్ కొనియాడారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయనకు రేవంత్ రెడ్డి రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రూ. కోటి పురస్కారం ఇస్తామని చెప్పారు. కాగా, రాహుల్ సిప్లిగంజ్ ఆర్ఆర్ఆర్ మూవీలో నాటు నాటు పాట ద్వారా ఆస్కార్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే.