ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

  జుక్కల్, బతుకమ్మ :   కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని జుక్కల్ క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు రాహుల్ గాంధీ దీర్ఘాయుష్షు, ఆయురారోగ్యాలు కోరుతూ కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ ప్రజల సంక్షేమం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య...