Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 June 2026, 9:30 pm Posted by : ramakrishna

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు..

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో బ్లాక్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షులు, లోక్ సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ 56వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటూ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరు చంద్రశేఖర్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ కుటుంబం పదవులకు కాకుండా దేశం కోసం త్యాగం చేసే కుటుంబం అని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కావున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇందూరి సునీత చంద్రశేఖర్, ఉప సర్పంచ్ షేక్ నిసార్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, నాయకులు పత్తి రాము, అక్కపల్లి నాగేందర్,  కర్క అశోక్, గౌస్, నెరుగంటి బాలరాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.