కులగణనతోనే ఓబీసీలకు న్యాయమని నమ్మిన వ్యక్తి రాహుల్ గాంధీ

నిజామాబాద్, బతుకమ్మ: కుల గణనతోనే ఓబీసీలకు న్యాయం జరుగుతుందని నమ్మిన వ్యక్తి రాహుల్ గాంధీ అని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ అన్నారు. కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం వారు విలేకరులతో మాట్లాడారు. జనగణనలో భాగంగా కుల గణన సైతం చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం అభినందనీయమని అన్నారు.  ఈ ఘనత కులగణన కోసం దేశ ప్రజల పక్షాన ఐదేళ్లపాటు కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన రాహుల్ గాంధీకి...