రోళ్లవాగు ప్రాజెక్ట్ కి త్వరగా అనుమతులు ఇప్పించండి
నిజామాబాద్, బతుకమ్మ : జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలో గల రోళ్ల వాగు ప్రాజెక్ట్ కి సంబంధించిన అనుమతుల త్వరగా ఇప్పించాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ని, నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు అర్వింద్ ధర్మపురి కోరారు. ఇటీవల జగిత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, ఈఅనుమతుల విషయంలో చొరవ తీసుకోవాలని ఎంపీ అర్వింద్ ని కోరారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని మంత్రి కార్యాలయంలో ఆయన్ను కలిసి విన్నవించారు. జగిత్యాల అర్బన్ మండలంలో అర్బన్ ఫారెస్ట్ ల అభివృద్ధి...