Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 April 2025, 2:55 pm Posted by : ramakrishna

భూ భారతితో సమస్యలకు సత్వర పరిష్కారం

హైదరాబాద్, బతుకమ్మ: భూ సమస్యలకు భూ భారతితో సత్వర పరిష్కారం లభిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. హైదరాబాలోని శిల్పారామం శిల్పకళా వేదికలో భూభారతి పోర్టల్ ను మంగళవారం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పదేళ్ల విధ్వంసానికి పరిష్కారం భూ భారతి అని అన్నారు. భూ భారతి ఆర్ఓఆర్ చట్టం ద్వారా భూమి హక్కులు భద్రంగా ఉంటాయని, రైతుల మేలు కోసం తీసుకొచ్చామని, ఇది చారిత్రక మార్పు అని పేర్కొన్నారు.

గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ధరణి ప్రజలకు శాపమైతే ప్రజల భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కారానికి భూ భారతి వరం కానుందని అన్నారు. భూమికోసం, భుక్తికోసం, విముక్తి కోసం ఎంతో మంది చేసిన పోరాట స్ఫూర్తితో, వారి ఆశయాలకు అనుగుణంగా ఏర్పాటు చేసిన చట్టమే భూభారతి అని పేర్కొన్నారు.


Quick solution to problems with Bhu Bharati