Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 June 2025, 8:24 pm Posted by : ramakrishna

యూరియా కోసం విభిన్నరీతిలో క్యూ

ముప్కాల్, బతుకమ్మ : ఖరీఫ్ సీజన్ కు గాను తోటల్లో చల్లేందుకు  రైతులు, మహిళలు యూరియా కోసం సొసైటీ వద్ద విభిన్న రీతిలోచెప్పులు క్యూ లో పెట్టి యూరియా కోసం పడిగాపులు కాస్తున్న ఘటన రెంజర్ల సొసైటీ వద్ద చోటు చేసుకొంది. తోటలకు మందు చల్లే  సీజన్ ఉండడం, జిల్లాలో యూరియా కొరత ఉండడం కారణంగా నాకు నీకు అంటూ యూరియా కోసం మహిళలు, రైతులు పడిగాపులు కాస్తున్నారు.యూరియా కోసం ఎండలో నిలబడి, నిలబడి నీరసం చెందిన రైతులు వరుస ప్రకారం తమ చెప్పులను క్యూ లో పెట్టి లైన్ కోసం నీడలో రైతులు వేచిచుస్తున్నారు.రైతులు, మహిళలు క్యూ లో పెట్టిన చెప్పుల వరుస సొసైటీ గోడౌన్ నుండి అప్పుడే యూరియా స్టాక్ తెచ్చిన లారీ కింది నుంచి గేట్ వరకు వచ్చింది. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ మేము కోరుకొన్న మార్పు ఇదేనాని, ఈ శాస్తి మాకు జరగాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Queue differently for urea