. . . సోషల్ మీడియాలో వైరల్ అంతా ఉత్తిదే
. . . 24 గంటల్లోనే ఇద్దరి ఫై సస్పెన్షన్ ఎత్తివేత
. . . విద్యాశాఖ అధికారుల విచారణపై విమర్శల వెల్లువ
నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లాలో పదవ తరగతి హింది ప్రశ్న పత్రం లీక్ వ్యవహారం విచారణ పై పలు విమర్శలు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఈనెల 18న జిల్లాలోని మూడు పరీక్ష కేంద్రాల నుంచి హిందీ ప్రశ్నాపత్రం లీక్ అయిందని 9 మంది చీప్ సూపరింటెండ్ లతోపాటు డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను సస్పెన్షన్ చేసిన విషయం తెలిసింది. ఈ విచారణలో హడావిడి నిర్ణయం తీసుకున్నారో లేక ఒత్తిళ్లకు తలోగ్గరో తెలియదు కానీ ఇద్దరు అధికారులపై సస్పెన్సన్ ఎత్తివేస్తూ డీ ఈ ఓ ఉత్తర్వులు ఇచ్చారు. ఉగాది పండగ నాడు బోధన్ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రం చీఫ్ సూపర్డెంట్ గా విధులు నిర్వహించిన పెంటాకలన్ జెడ్పిహెచ్ఎస్ స్కూల్ అసిస్టెంట్ కే. వేణు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్గా వ్యవహరించిన కల్దుర్కి జెడ్ పి హెచ్ ఎస్ స్కూల్ అసిస్టెంట్ శివానంద రావు ల ఫై గురువారం వెలువరించిన సస్పెన్షన్ శుక్రవారం ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు జిల్లా విద్యాశాఖ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు జరిపిన విచారణ అంతా ఉత్తిదేనా అని విమర్శలు వస్తున్నాయి. 24 గంటలు గడవక ముందే ఇద్దరికీ క్లీన్ చీట్ ఇచ్చి సస్పెన్షన్ ఎత్తివేయడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని వాదనలు వినిపిస్తున్నాయి. పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ తో జిల్లా పరువు గంగలో కలిసింది. అలాంటి తప్పిదాలు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అధికార యంత్రాంగం 24 గంటల్లోనే ఎలా క్లీన్ చీట్ ఇచ్చారని చర్చ మొదలైంది.
