ఇరిగేషన్ లో ఇంతుల లొల్లి

నిజామాబాద్, బతుకమ్మ:  ఇంతుల మధ్య ఆధిపత్య పోరు ఇరిగేషన్ శాఖకు తలనొప్పిగా మారింది. నిజామాబాద్ ఇరిగేషన్ (ఎస్ ఈ) కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగినులకు మొదటి నుంచి పడరాదని, వారి మధ్య ఎప్పుడూ గొడవ జరుగుతుంటుందని ఇంటాబయట చర్చించుకుంటారు. అయితే ఈ పరిస్థితి రోజురోజుకు ముదరుతోంది. ఇటీవల నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో చోటు చేసుకున్న ఘటన వీరిద్దరి మధ్య కొనసాగుతున్న గొడవలు పెద్దవి అయ్యేందుకు కారణమైంది. ఆధిపత్య పోరుకోసం ఆరాటపడుతున్న ఇద్దరు ఉద్యోగినులు నేనంటే నేను అంటున్నారు. ఓ ఉద్యోగిణి భర్త టీఎన్జీవోస్...