Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 March 2025, 3:43 pm Posted by : ramakrishna

ఇరిగేషన్ లో ఇంతుల లొల్లి

నిజామాబాద్, బతుకమ్మ:  ఇంతుల మధ్య ఆధిపత్య పోరు ఇరిగేషన్ శాఖకు తలనొప్పిగా మారింది. నిజామాబాద్ ఇరిగేషన్ (ఎస్ ఈ) కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగినులకు మొదటి నుంచి పడరాదని, వారి మధ్య ఎప్పుడూ గొడవ జరుగుతుంటుందని ఇంటాబయట చర్చించుకుంటారు. అయితే ఈ పరిస్థితి రోజురోజుకు ముదరుతోంది. ఇటీవల నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో చోటు చేసుకున్న ఘటన వీరిద్దరి మధ్య కొనసాగుతున్న గొడవలు పెద్దవి అయ్యేందుకు కారణమైంది. ఆధిపత్య పోరుకోసం ఆరాటపడుతున్న ఇద్దరు ఉద్యోగినులు నేనంటే నేను అంటున్నారు. ఓ ఉద్యోగిణి భర్త టీఎన్జీవోస్ లో రాష్ట్రస్థాయి నాయకుడు కావడంతో సదరు మహిళ తనతోనే గొడవకు వస్తావా? అంటూ కళ్లెర్రజేస్తోంది. తనపైస్థాయి అధికారిణి ఆదేశాలను ధిక్కరిస్తోంది. తనకు రాష్ట్రస్థాయిలో పలుకుబడి ఉందని నీవు చెప్తే నేను చేసేదేమిటి అంటూ దుర్భాషలాడుతోంది. ఇరిగేషన్ లో ఇంతుల మధ్య లొల్లి చర్చనీయాంశమైంది.