Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 June 2025, 5:19 pm Posted by : ramakrishna

నాణ్యమైన విత్తనం..  రైతన్నకు నేస్తం

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : నిజామాబాదు రూరల్ మండలం గుండారం గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థ అయిన ప్రాంతీయ చెరుకు, వరి పరిశోధన స్థానం రుద్రూర్ ద్వారా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం కార్యక్రమంలో భాగంగా రైతు వేదిక గుండారం నందు వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో రైతులకు నాణ్యమైన వరి, పెసర విత్తనాలను పంపిణీ చేశారు. నాణ్యమైన విత్తనాలను సేకరించి సాగు చేయడం వలన దిగుబడిలో సుమారుగా 10 నుంచి 15% పెంపొందించవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి వీర స్వామి సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి రెవెన్యూ గ్రామం నుంచి మూడు నుండి ఐదుగురు అభ్యున్నత రైతులను వ్యవసాయ శాఖ గుర్తించి వారికి యూనివర్సిటీ ద్వారా విత్తనాన్ని పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ విత్తనాన్ని రైతులు పంట కాలం ముగిసిన తర్వాత తమ తోటి రైతులతో పంచుకోవాలని రుద్రూర్ పరిశోధన స్థానం శాస్త్రవేత్త సాయి చరణ్ సూచించారు. ప్రతి గ్రామంలో నాణ్యమైన విత్తనాన్ని రైతులు ఉపయోగించటం, తోటి రైతుల తో పంచుకోవడం వలన విత్తన స్వయం సమృద్ధి ఏర్పడుతుందని వ్యవసాయ అధికారి హీరా అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం లో వ్యవసాయ అధికారి విజయ్, విస్తరణ అధికారులు రాకేష్, స్వాతి, జ్ఞనేశ్వర్, ఎం.సాయి చరణ్ శాస్త్రవేత్త ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోదన స్థానం రుద్రూర్, వసంత లక్ష్మి, సొసైటీ చైర్మన్ శ్రీధర్, రైతులు పాల్గొన్నారు.