. . . అభివృద్ధిపనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే ధన్ పాల్
ఇందూరు,బతుకమ్మ:
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో కొనసాగుతున్నపనుల్లో నాణ్యత ఎంతో ముఖ్యమని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ స్పష్టంచేశారు. గురువారం నగరంలోని 22, 25, 35వ డివిజన్ లోపలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేమాట్లాడుతూ… ఇటీవల నిర్వహించిన కార్పొరేషన్ కౌన్సిల్ లో ప్రతి డివిజన్ కు 20లక్షల నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ నేపథ్యంలో అన్ని డివిజన్ ల అభివృద్ధి పనులకు భూమి పూజ చేయడం జరుగుతుందన్నారు. అలాగే డివిజన్ కు కోటి రూపాయలపనులు కూడా కొన్ని డివిజన్ లో ప్రారంభమయ్యాయని, మరికొన్ని ప్రారంభం కాబోతున్నాయని తెలిపారు.అమృత్2 పథకం కింద నగరంలో యూజీడీ పనులు కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. అయితే పనుల్లోవేగం పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఇటీవల అధికారులతో సమీక్ష నిర్వహించి సూచించడంజరిగిందన్నారు.

ఎల్ నినోప్రభావం తో రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉంది, కావున పొదుపుగాతీసుకోవాలన్నారు. ప్రధానంగా అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పడంజరిగిందన్నారు. అలాగే ఇందూరులోఘన చరిత్ర గల అతి పురాతనమైన ఖిల్లా రామాలయం అభివృద్ధిలో భాగంగా రోప్ వే కూడారాబోతుందన్నారు. ఇటీవల ఇందుకు సంబంధించిన అధికారులు, కంపెనీ ప్రతినిధులు సందర్శించారని గుర్తు చేశారు.కార్యక్రమంలో మేయర్ కూరగాయల ఉమారాణి, 22వ డివిజన్ కార్పొరేటర్ వైష్ణవి సుధా, 25వ డివిజన్కార్పొరేటర్ చింతకాయల రాజేందర్, 35వ డివిజన్ కార్పొరేటర్ ఎర్రం సుధీర్, బీజేపీ నాయకులుపవన్ ముందడ , శ్రీనివాస్, మారావార్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.