మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి

రుద్రూర్, బతుకమ్మ : విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని అడిషనల్ కలెక్టర్ అంకిత్ సూచించారు. రుద్రూర్ లోని కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్, పాఠశాలను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగదిని, అందులోని సామగ్రిని పరిశీలించారు. అలాగే మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులకు పలు సలహాలు, సూచనలు చేశారు. అడిషనల్ కలెక్టర్ వెంట పాఠశాల ప్రత్యేక అధికారిణి శ్యామల, తహసీల్దార్ తారాబాయి, ఎంపీడీవో సురేశ్ బాబు, పాఠశాల సిబ్బంది తదితరులు ఉన్నారు.