విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి, బతుకమ్మ : పాఠశాలలు, వసతి గృహాల్లోనీ విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత కలిగి ఉండే విధంగా ఆయా ఇన్చార్జిల పర్యవేక్షణ నిర్వహిస్తూ ఉండాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని మండల విధ్యాధికారులు, వసతి గృహాల సంక్షేమ అధికారులకు ఆహార భద్రత పై ఓరియంటేషన్ కమ్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో జరుగుతున్న వార్తలపై జిల్లాలోని యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని...