విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి, బతుకమ్మ : విద్యార్థులకు నాణ్యమైన భోజనం,  మంచి విద్యా బోధన అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం మధ్యాహ్నం తెలంగాణ గిరిజన సంక్షేమ బాలుర రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలను కలెక్టర్ సందర్శించారు. తొలుత కలెక్టరు కు విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. రెసిడెన్షియల్ స్కూల్,కాలేజి లో విద్యార్థుల సంఖ్య, విద్యాబోధన అంశాలను ప్రిన్సిపాల్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ , విద్యార్థులకు మంచి విద్య, మంచి భోజనం మెనూ ప్రకారం అందించాలని...