నాణ్యమైన విద్యనందించాలి
నిజామాబాద్, బతుకమ్మ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలని ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. సుభాష్ నగర్ లోని క్యాంప్ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంగళవారం సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలు అధ్వానస్థితిలో ఉన్నాయని, కొందరు ఉపాధ్యాయులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల నిర్లక్ష్యంగా కారణంగా నాణ్యమైన విద్య అందక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోందన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉపాధ్యాయుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని...