భీమ్ గల్, బతుకమ్మ : గవర్నమెంట్ స్కూళ్లు, కాలేజీలల్లోనే క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు, లెక్చరర్లు ఉండడం మూలాన విద్యార్థులకు న్యాణమైన విద్యా అందుతుందని భీమ్ గల్ జూనియర్ కాలేజీ లెక్చరర్లు శ్రీనివాస్, సాయి కుమార్, సత్యనారాయణలు విద్యార్థులకు వివరించారు. 2024_25 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్స్ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా మండలంలోని దేవక్కాపేట్, సికింద్రాపూర్, గోనుగొప్పుల హై స్కూల్లల్లో ఎస్సేస్సీ విద్యార్థులకు అవగాహన కలిపించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎస్సేస్సీ అనంతరం ఎవరో చెప్పిన మాటలు వినకుండా గవర్నమెంట్ లో అడ్మిషన్ తీసుకొని శ్రద్దగా చదివితే విద్యాభివృద్ధి అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాల ఎస్సేస్సీ విద్యార్థిని, విద్యార్థులు,సిబ్బంది పాల్గొన్నారు.
