- ఎంఈఓ గంగాధర్
నందిపేట్, బతుకమ్మ: “ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించడమే మా లక్ష్యం” అని మండల విద్యాధికారి అవదుత్ గంగాధర్ తెలిపారు. గురువారం నందిపేట్ మండలంలోని ఐలాపూర్ జెడ్పీ హై స్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన నూతన విద్యా సంవత్సరం ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, దుస్తులు, నోట్‌బుక్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత సంవత్సరం పదవ తరగతి ఫలితాల్లో ఐలాపూర్ పాఠశాల మంచి విజయాలు సాధించిందని, ఇది ఉపాధ్యాయుల కృషికే నిదర్శనమని అన్నారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని మంచి భవిష్యత్తు కోసం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ మీసాల సుదర్శన్, హెడ్‌మాస్టర్ ఏ .లాలయ్య, ఉపాధ్యాయులు మురళి, రాజేశ్వర్, రామకృష్ణ, సీఆర్పి రాజు తదితరులు పాల్గొన్నారు.