శానిటేషన్ పై స్పెషల్ ఫోకస్ పెట్టండి
అడిషనల్ కలెక్టర్ అంకిత్ బతుకమ్మ, నిజామాబాద్ ప్రతినిధి - భీంగల్ పట్టణం తో మండలంలోని అన్ని గ్రామాల అధికారులు శానిటేషన్ పై స్పెషల్ ఫోకస్ పెట్టాలని లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. బుధవారం స్వచ్చదనం_పచ్చదనం కార్యక్రమం లో భాగంగా భీంగల్ పట్టణంలోని పలు వార్డులల్లో పర్యటించారు. నాలుగో వార్డులో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్ లో గ్రౌండ్, చుట్టూ పరిసరాలను పరిశీలించారు. స్కూల్ లో విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అనంతరం మైనార్టీ రెసిడెన్సీయల్ స్కూల్ ను...