Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 August 2024, 9:50 am Posted by : ramakrishna

శానిటేషన్ పై స్పెషల్ ఫోకస్ పెట్టండి

  • అడిషనల్ కలెక్టర్ అంకిత్

బతుకమ్మ, నిజామాబాద్ ప్రతినిధి – భీంగల్ పట్టణం తో మండలంలోని అన్ని గ్రామాల అధికారులు శానిటేషన్ పై స్పెషల్ ఫోకస్ పెట్టాలని లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. బుధవారం స్వచ్చదనం_పచ్చదనం కార్యక్రమం లో భాగంగా భీంగల్ పట్టణంలోని పలు వార్డులల్లో పర్యటించారు. నాలుగో వార్డులో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్ లో గ్రౌండ్, చుట్టూ పరిసరాలను పరిశీలించారు.

స్కూల్ లో విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అనంతరం మైనార్టీ రెసిడెన్సీయల్ స్కూల్ ను సందర్శించిన ఆయన విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ముఖ్యంగా భీంగల్ మున్సిపల్ పరిధిలో ఎక్కడ చెత్త, చేదారం కనిపించకూడదని, అందుకు కావాల్సిన చర్యలు వెంటనే చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ వై. రామకృష్ణను ఆదేశించారు. ఈ కార్యక్రమం లో చైర్మన్ ప్రేమలత సురేందర్, మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ వార్డ్ ఆఫీసర్లు, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Big pothole on the main road.. passengers are worried..