పెట్టారు.. తీసివేశారు..
మున్నాళ్ళ ముచ్చటగా 'విజయ' కేంద్రాలు అమ్మకాలు గాకుండా ప్లాంట్ సిబ్బంది అడ్డు ఉత్పత్తి, విక్రయాలు పెరగడం గగనమే నిజామాబాద్, బతుకమ్మ: నవ్విపోదురు గాక మాకేటి సిగ్గు అన్నట్లుగా తయారయింది విజయ డెయిరీ అధికారుల పరిస్థితి. పాల ఉత్పత్తిని పెంచి వినియోగదారులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని డెయిరీ రాష్ట్ర చైర్మన్ అమిత్ రెడ్డి, బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. రాజకీయ నాయకులు చెప్తే వినాలా... తమ పనులు చేసుకుంటామన్నట్లుగా అధికారులు ప్రవర్తిస్తున్నట్లు కనబడుతోంది. పదేపదే విజయ పాల గురించి ఎమ్మెల్యే ఆరా తీస్తుండడంతో...