. . . డిస్ట్రిక్ట్ స్పెషల్ ఆఫీసర్ దాసరి ఒడ్డెన్న
భీంగల్, బతుకమ్మ :
గత పది సంవత్సరాల నుండి గవర్నమెంట్ కాలేజ్ లో చదివి సక్సెస్ అయ్యిన విద్యార్థుల ఫ్లెక్సీని ఈ విద్యా సంవత్సరం మనం నిర్వహించే పేరెంట్స్ మీటింగ్ రోజు కాలేజ్ లో పెట్టించాలని డిస్ట్రిక్ట్ స్పెషల్ ఆఫీసర్ దాసరి ఒడ్డెన్న ఆదేశించారు. గురువారం భీంగల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సక్సెస్ స్టూడెంట్ల ఫోటోలు పెట్టి ఫ్లెక్సీలు పెట్టడం మూలాన అటు తల్లిదండ్రులకు, ఇటు విద్యార్థులకు ప్రేరణగా ఉంటుందని తెలిపారు. ఆకస్మిక తనిఖీలో భాగంగా కాలేజ్ లో నిర్వహించే ప్రాక్టికల్ కు సంబంధించిన, ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ కు సంబంధించిన, పేరెంట్స్ మీటింగ్ కు సంబంధించిన సమాచారాన్ని వారు అడిగి తెలుసుకున్నారు. కాలేజ్ లో భౌతిక శాస్త్రానికి సంబంధించిన ఆన్లైన్ తరగతుల సమాచారంను గూర్చి విద్యార్థులను అనేక రకాల ప్రశ్నలను అడిగి వాటికి తగిన సమాచారాన్ని ఆయన రాబట్టారు. కాలేజ్ నిర్వహణకు సంబంధించిన రికార్డుల సమాచారాన్ని సేకరించి వాటిని కూడా తనిఖీ చేశారు. అనంతరం కళాశాల ఆవరణ పరిశుభ్రత గురించి ఆరా తీసినంతరం సమాచారాన్ని పూర్తిగా కళాశాల ప్రిన్సిపల్ చెరుకుపల్లి జయపాల్ రెడ్డి అందించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నరసయ్య, అధ్యాపక బృందం, కార్యాలయ నిర్వాహక బృందం పాల్గొన్నారు.
