నగరపాలక సంస్థలో ప్రక్షాళన
బతుకమ్మ ఎఫెక్ట్ పారిశుధ్ద్య, రెవెన్యూ విభాగాల వారికి బదిలీలు సొంత స్థానాలకు బదిలీలు చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు బతుకమ్మ, నిజామాబాద్ : నగర పాలక సంస్థలో ప్రక్షాళన షురూ అయింది. ఈ నెల 15న బతుకమ్మలో వచ్చిన కథనానికి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్పందించారు. బల్ధియాలో రెగ్యులర్ ఉద్యోగులపై ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పెత్తనంపై వచ్చిన కథనానికి స్పందించి గురువారం బదిలీలు చేశారు. ప్రధానంగా ముఖ్య శాఖలైన రెవెన్యూ, పారిశుధ్ద్య విభాగంలో బదిలీ చేస్తూ మున్సిపల్ కమిషనర్ మంద మకరంద్ ఉత్తర్వులు జారీ చేశారు....