Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 August 2024, 11:42 pm Posted by : ramakrishna

నగరపాలక సంస్థలో ప్రక్షాళన

  • బతుకమ్మ ఎఫెక్ట్
  •  పారిశుధ్ద్య, రెవెన్యూ విభాగాల వారికి బదిలీలు
  • సొంత స్థానాలకు బదిలీలు చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు

బతుకమ్మ, నిజామాబాద్ : నగర పాలక సంస్థలో ప్రక్షాళన షురూ అయింది. ఈ నెల 15న బతుకమ్మలో వచ్చిన కథనానికి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్పందించారు. బల్ధియాలో రెగ్యులర్ ఉద్యోగులపై ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పెత్తనంపై వచ్చిన కథనానికి స్పందించి గురువారం బదిలీలు చేశారు. ప్రధానంగా ముఖ్య శాఖలైన రెవెన్యూ, పారిశుధ్ద్య విభాగంలో బదిలీ చేస్తూ మున్సిపల్ కమిషనర్ మంద మకరంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల కాలంలో నగరపాలక సంస్థ పారిశుద్ధ్య, ఆరోగ్య విభాగములో బదిలీ చేశారు. కార్పొరేషన్ లో ఇంటి నెంబర్లు కేటాయింపు లో కీలక విభాగం అయిన రెవెన్యూ విభాగములో కొంత మంది బిల్ కలెక్టర్లను వారి సొంత విభాగానికి పంపుతూ ఉత్తర్వులు ఇచ్చారు. రెవెన్యూ విభాగం నుండి సొంత విభాగానికి బదిలీ అయిన వారిలో పబ్లిక్ హెల్త్ వర్కర్ లు మల్లేస్, లక్ష్మణ్ , సాయిరాం, సాయి విశ్వప్రకాష్, నరేష్, రాజేందర్ , శంకర్ లు ఉన్నారు. స్థానంలో రెగ్యులర్ ఉద్యోగులు లింబాద్రి, గంగాధర్, అశోక్, ప్రేమ్, ఎమ్ గంగాధర్, రఫీక్, సాయన్న, శ్రీకాంత్, మహేష్, మధుసుదన్, ఎస్ గంగాధర్, సుమన్, రాజారాం, దత్తు, నరేందర్, ప్రమీలు ఉండగా ఇటీవల బదిలీపై వచ్చిన బిల్ కలెక్టర్లు సలీముద్దీన్, మోహిణుద్దీన్, రవికుమార్ లను బిల్ కలెక్టర్లుగా నియమించారు. రెవెన్యూ ఇన్ఫెక్టర్ లుగా శ్రీనివాస్, సుభాష్, గంగమల్లు, బాల్ రెడ్డి, శ్రీనివాస రావులను నియమించారు. బిల్ కలెక్టర్ విధుల నుంచి తప్పించిన వారిలో బిల్ కలెక్టర్లతో ట్రేడ్ లైసెన్సులు ఆస్తి పన్నుల విభాగములో సర్వేకు కేటాయిస్తూ కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. ఆరోపణలు ఎక్కువగా వస్తున్న రెవెన్యూ విభాగములో సంపూర్ణ ప్రక్షాళనకు కమిషనర్ దృష్టి సారించారు.

Purification in Municipal Corporation