Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 October 2024, 6:06 pm Posted by : ramakrishna

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

 తహసీల్దార్ కు విండో చైర్మన్ వినతిపత్రం అందజేత

బతుకమ్మ, నవీపేట్ : ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు ఏర్పాటు చేయాలని కోరుతూ బినోల విండో చైర్మన్ మగ్గరి హన్మాండ్లు శుక్రవారం నాడు తహశీల్దార్ వెంకట్ రమణ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ సొసైటీ పరిధిలో వరి కోతలు ప్రారంభమయ్యాయని అన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతుల వద్ద ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధర కు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. సన్న రకం పండించిన రైతులు ప్రభుత్వం ప్రకటించిన 500 రూ. బోనస్ కొరకు వరి కొనుగోలు కేంద్రాల వద్ద వడ్లను ఆరబోసి ఎదురుచూస్తున్నారని, సివిల్ సప్లై అధికారులు ఎలాంటి మార్గదర్శకాలు అనుమతులు ఇవ్వకపోవడంతో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదని, ప్రభుత్వం, జిల్లా అధికారులు వెంటనే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పరచాలని కోరారు.